బెస్ట్ బ్లడ్ డోనర్ అవార్డు అందుకున్న కలెక్టర్ ను సన్మానించిన టీఎన్జీవోలు
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ టిఎన్జీవోస్ జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి అధ్యక్షతన కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(District Collector Ashish Sangwan)కు సోమవారం కలెక్టరేట్లో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) చేతులమీదుగా ఇటీవల రాజ్ భవన్ లో రాష్ట్రస్థాయి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన “బెస్ట్ బ్లడ్ డోనర్“అవార్డు తీసుకొన్న సందర్బంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా సమావేశ హాలులో కలెక్టర్ కి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి విజయక్రాంతి ప్రతినిధితో మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో బెస్ట్ బ్లడ్ డోనర్ కామారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఈ అవార్డు లభించడం హర్షించదగ్గ విషయం అన్నారు. కలెక్టర్ చేస్తున్న కృషిని గుర్తించి అవార్డు రావడం భవిష్యత్తులో కూడా రాష్ట్రస్థాయిలో మరిన్ని అవార్డులు సాధించాలని ఆయన అన్నారు. జిల్లా కార్యదర్శి ఎం. నాగరాజు, సహాధ్యక్షులు ఎం. చక్రధర్, కోశాధికారి ఎం. దేవరాజు.. ఉపాధ్యక్షులు లక్ష్మణ్, రాజ్యలక్ష్మి, బి రాజేశ్వర్, సంయుక్త కార్యదర్శి అబ్దుల్ ఖాదిర్, రాజమణి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ కుమార్, కల్చరల్ సెక్రటరీ రాజ్ కుమార్, ఈసీ మెంబర్లు సాయినాథ్, దత్తాద్రి తదితరులు పాల్గొన్నారు.






