17 April, 2026 | 4:07 PM

బదిలీపై వెళ్తున్న పోలీస్ లను సన్మానించిన దేవునిపల్లి పోలీసులు

16-06-2025 07:13 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్(Devanpally Police Station) పరిధిలో పనిచేసినటువంటి ఎస్ఐ అమృనాయక్, ఏఎస్ఐ నర్సింగరావు, పోలీస్ కానిస్టేబులు దేవిచంద్ విజయ్, శంకర్, పవన్ కుమార్, రాజేశ్వరి హోంగార్డ్, సురేష్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఐఏఎస్ పారదర్శకంగా బదిలీలు చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా బదిలీపై వెళ్తున్న వారందరు  కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ  కావడం జరిగింది. ఇందులో భాగంగా దేవునిపల్లి ఎస్సై రాజు ఆధ్వర్యంలో సిబ్బంది కలిసి బదిలీపై వెళ్తున్న పోలీస్ అధికారులు సిబ్బందిని ఘనంగా సన్మానించారు.