16-06-2025 07:07:14 PM
బోథ్ (విజయక్రాంతి): బీమ్ ఆర్మీ బోథ్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులుగా భగత్ ప్రవీణ్(Bhagat Praveen) ఎన్నికయ్యాడు. ఈ మేరకు సోమవారం నియమాక పత్రాన్ని ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు షేక్ షకీల్(District President Sheikh Shakeel) అందజేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు భగత్ ప్రవీణ్ మాట్లాడుతూ... రాజ్యాంగ పరిరక్షనే ధ్యేయంగా ఆజాద్ చంద్రశేఖర్ స్థాపించిన భీమ్ ఆర్మీ సంస్థ తనపైన నమ్మకంతో బోథ్ అసెంబ్లీ అధ్యక్షులుగా నియమించినందుకు అధ్యక్షులు షకీల్ కు ధన్యవాదములు తెలిపారు.
రాజ్యాంగ పరిరక్షణ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రాజ్యాధికారం కోసం, హక్కుల కోసం అందరం పోరాడుతూ అంబేద్కర్ ఆశయాలే ద్యేయంగా ముందుకు సాగుతూ భీమ్ ఆర్మీని బలోపేతం చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కిరణ్, భీమ్ ఆర్మీ వార్డ్ అధ్యక్షులు రాహుల్, మైనారిటీ యూత్ ప్రెసిడెంట్ జావిద్ ఖాన్, షారుక్, అర్బజ్, కేశవ్, తదితరులు పాల్గొన్నారు