15 March, 2026 | 7:51 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

శాంతియుతంగా ఉండాలి

18-02-2026 12:00 AM
  1. రంజాన్‌ప్రార్థనలకు వచ్చే వారికి అసౌకర్యం కలగకూడదు
  2. చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్ అలీతో కలిసి సీపీ క్షేత్రస్థాయి పరిశీలన
  3. మక్కా మసీదులో భద్రతా ఏర్పాట్లపై సీపీ సజ్జనార్ సమీక్ష 

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): రంజాన్ మాసం ప్రారం భం కానున్న నేపథ్యంలో, పాతబస్తీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన లు జరగ కుండా, ప్రార్థనలు శాంతియుతంగా జరిగేలా హైదరాబాద్ పోలీస్ యం త్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మక్కా మసీదును సందర్శించి భద్రతా చర్యలను చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్ అలీతో కలిసి ఆయన మసీదు ప్రాంగణం పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

కమిషనర్ సజ్జనార్ అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ అధికారులతో మాట్లాడారు. రంజాన్ మా సంలో నగరం నలుమూలల నుంచి వేలాది మంది ముస్లింలు ప్రార్థనల కోసం మక్కా మసీదుకు తరలివస్తారని, వారికి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేదా భద్రతా పరమైన అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. అంతకు ముందు, పురానీ హవేలీ లోని కొత్వాల్ హౌస్‌లో ముస్లిం మత పెద్దలతో కమిషనర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

నెల రోజుల పాటు సాగే రంజాన్ ఉపవాస దీక్షలు, ప్రార్థనలు పండుగ వేడుకల నిర్వహణపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ ఎస్‌ఏం విజయ్ కుమార్, చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.