6 April, 2026 | 6:18 AM

చెన్నూర్ అభివృద్ధికి సహకరించాలి

07-12-2024 08:44 PM

చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్...

మందమర్రి (విజయక్రాంతి): చెన్నూర్ నియోజకవర్గం అభివృద్ధికి ప్రజలు సహకరించాలని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరారు. శనివారం మండలంలో పర్యటించిన ఆయన 2.60 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. మండలంలోని పొన్నారం గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల ప్రహరీ నిర్మాణం, సీసీ రోడ్డు పనులను అయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గందే రాంచందర్, మండల ఇన్చార్జి కడారి జీవన్ కుమార్, మండల నాయకులు ఒద్నాల కొమురయ్య, గ్రామ నాయకులు మాసు సంతోష్ కుమార్, పెంచాల రాజలింగు, బొజ్జ రాములు, బేర సమ్మయ్యలు పాల్గొన్నారు.