ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని స్థానిక ప్రభుత్వ గిరిజన బాలల వసతి గృహం, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఇల్లందు జాతీయ సేవాపథకం విభాగం ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ తోర్తి జాన్ అధ్యక్షతన యాంటీ ర్యాగింగ్, డ్రగ్స్ పై శనివారం అవగాహన సదస్సులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సందీప్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ.. సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను పరిచయం పేరుతో వికృత చర్యలకు పాల్పడి, దూషించడం, హేళన చేయడం ఏడిపించడం భయభ్రాంతులకు గురిచేయడం లాంటి కార్యక్రమాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. ర్యాగింగ్ నిషేధ చట్టం-1997 ప్రకారం సెక్షన్ 4 లో పేర్కొనిన విధంగా ఆరు నెలలు జైలు శిక్ష పడటంతో పాటు రూ.1000 వరకు జరిమానా ఉంటుందన్నారు. ఎంజాయ్ ముఖ్యము కాదని మీ భవిష్యత్తు ముఖ్యమన్నారు. మానవ జీవితం అద్దం లాంటిదని విద్యతో పాటు సంస్కారం నేర్చుకోవాలని, పరిగెత్తే కాళ్లు పనిచేసే చేతులు రాష్ట్రానికి దేశానికి ఎంతైనా అవసరమని కావున గంజాయికి డ్రగ్స్ కి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. డ్రగ్స్ వాడితే సహనం కోల్పోయి మీ జీవితాన్ని సర్వం కోల్పోకుండా చూసుకోవాలని కోరారు.
అమూల్యమైన సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు అని సాధ్యమైనంత వరకు సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలని, క్రమశిక్షణతో ఉంటూ తల్లిదండ్రులు, సమాజానికి మంచిపేరు తేవాలని ర్యాగింగ్ కు పాల్పడ వద్దన్నారు. ఏ టీ డి ఓ ఎస్. రాధమ్మ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. సాఫ్ట్వేర్ మేనేజర్ శ్యామ్ మాట్లాడుతూ.. ప్రపంచంలో అతిపెద్ద పెనుభూతం డ్రగ్స్, సైబర్ క్రైమ్ అన్నారు. వీటిని నిర్మూలనకు అందరూ కూడా అవగాహన కలిగి ఉండాలని కోరుతూ సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. 14 నెంబర్ బస్తీ వార్డు కౌన్సిలర్ సంద బిందు మాట్లాడుతూ.. నేటి యువత రేపటి పౌరులు కావున ర్యాగింగ్ కు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ మరో ప్రోగ్రాం ఆఫీసర్ లైబ్రరీ అసోసియేషన్ నాయకులు కలం ప్రసాద్, మాజీ కౌన్సిలర్ సుదర్శన్ కోరి, ఎస్టీ వసతి గృహం వార్డెన్ చందు, ఎస్ టి బి హెచ్ హాస్టల్ వార్డెన్ భరత్ కుమార్, ఏఎన్ఎం శిరోమణి, సంద ప్రవీణ్ కుమార్, ఏ ఎస్ ఫ్ నాయకులు హరీష్, ఎస్ టి వసతి గృహ సహాయకులు, సుబ్రణ్మ్యం, బిసి వసతి గృహ సహాయకులు వినోద్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.




