కేంద్రంపై ఒత్తిడి తేవడానికే ఢిల్లీకి
క్యాంప్ కార్యాలయం ప్రారంభం సందర్బంగా మంత్రి పొన్నం
కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని మంకమ్మ తోటలో పొన్నం కాంప్లెక్స్ వద్ద నూతనంగా నిర్మించిన మినిస్టర్ క్యాప్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అనంతరం క్యాంప్ కార్యాలయంలో కుటుంబ సభ్యుల తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... కరీంనగర్ జిల్లాలో అభివృద్ధికి అందుబాటులో ఉండడానికి క్యాంప్ కార్యాలయం ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. అన్ని రకాల అర్జీలు, విజ్ఞాపన పత్రాలు, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఆస్పత్రికి సంబంధించిన సహాయాలు, విద్యార్థులు, మహిళలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు.
ప్రజాపాలన ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ శాసనసభలు చేసిన చట్టాన్ని గవర్నర్ నుండి రాష్ట్రపతి దగ్గరికి వెళ్లిన బిల్లు ఆమోదంపై కాంగ్రెస్ బీసీ నేతలు , అన్ని రాజకీయ పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి రావడానికి ఢిల్లీ వెళ్తున్నామన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించుకుంటామని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పార్టీలకతీతంగా ఎలా ఉద్యమం చేశామో.. ఇప్పుడు కూడా ప్రభుత్వం తీసుకున్న గొప్ప చారిత్రాత్మక నిర్ణయాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు. కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి మంత్రులు బీసీ ప్రజా ప్రతినిధులు సానుకూలంగా కార్యాచరణ తీసుకొని ప్రభుత్వ ప్రతిపాదనను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ ఇతర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు






