రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర: ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): రాజ్యాంగాన్ని మార్చి దేశం లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ఎత్తివేయాలని బీజేపీ కుట్రలు చేస్తోందని ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, సీపీ ఎం, సీపీఐ తదితర పార్టీలు ఆరోపిస్తున్నాయని, దీనిపై ప్రధాని మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ జాతీయ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. వివిధ 13 బీసీ సంఘాల నేత లు ఆదివారం హైదరాబాద్‌లో సమావేశమై రిజర్వేషన్ల అమలు, బీసీల అభివృద్ధి అంశంపై చర్చించారు. పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా కానీ, బీసీల అభివృద్ధికి ఒక్క పథకం కూడా పెట్టలేదన్నారు. పైగా అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లను అమలుచేశారని మండిపడ్డారు. బీసీ ల్లో కులగణన చేయాలని, జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు పెం చాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లపై న్యాయపరమైన వివాదాలు తలెత్తుతున్నాయని, శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయా లని డిమాండ్ చేశారు. బీసీ సంఘాల నాయకులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, రాజేందర్, రామకృష్ణ పాల్గొన్నారు.






