27-08-2024 12:40:44 AM
టీపీఏ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్
మంచిర్యాల, ఆగస్టు 26 (విజయక్రాంతి): యువత కామెంట్ల కోసం సాహసాలు చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారని తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ (టీపీఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మోత్కూరి రాంచందర్ అన్నారు.టీపీఏ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాల్యం నుంచే చెడు వ్యసనాలకు బానిసలై యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. ఎలాంటి లక్ష్యం లేకుండా సోషల్ మీడియాలో లైకులు, కామెంట్ల కోసం బైక్ రైడింగ్ చేయడం, సాహసాలు చేయడం లాంటి వాటితో ప్రాణాల మీదకు కొని తెచ్చుకుంటున్నారన్నారు.
నేటి సమాజంలో మానసిక శాస్త్ర అవగాహన ఎంతో అవసరమని, ఆధునిక పోకడలను గమనిస్తూ వారిలో మానసిక దృఢత్వం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం సైకాలజిస్టులను గుర్తించి ప్రాథమిక స్థాయి నుంచి పాఠశాలలో విధిగా ఒక సైకాలజిస్టును నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం టీపీఏ జిల్లా అధ్యక్షుడు పోకల వెంకటేశ్వర్లు పదవీ విరమణ మహోత్సవంలో పాల్గొని శాలువాలు, పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో టీపీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపతి నారాయణ రావు, ప్రధాన కార్యదర్శి శశి కిరణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు మొగిలి, సుమన, చైతన్య, వేణు, రజిత, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.