calender_icon.png 12 September, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం

27-08-2024 12:41:45 AM

ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి

ఆదిలాబాద్, ఆగస్టు 26 (విజయ క్రాంతి): దవాఖాన యాజమాన్యాలు వైద్యు లు, వైద్య సిబ్బంది భద్రతకు పాధాన్య ఇవ్వాలని, ప్రతి దవాఖానలో సీసీ కెమెరాల నిఘా ఉండాలని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి సూచించారు. కలెక్టర్ రాజరి షా, ఎస్పీ గౌ ష్ అలం ఆదేశాల మేరకు సోమవారం ఆ యన జిల్లాకేంద్రంలోని రిమ్స్‌ను దవాఖాన డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌తో కలిసి తనిఖీ చేశా రు. సుమారు రెండు గంటల పాటు అన్ని వి భాగాల్లో కలియదిరిగి భద్రతా పరంగా సె క్యూరిటీ సిబ్బందికి సూచనలిచ్చారు.

ఆసుపత్రిలో కొన్నిచోట్ల సీసీ కెమెరాలు పనిచేయడ ం లేదని డీఎస్పీ గుర్తించారు. వెంటనే ఓ ప్రైవేట్ టెక్నిషియన్ ను పిలిచించి వాటిని రిపేర్ చేయాలని సూచించారు. అవుట్ పోస్టులో నిరంతరం సెక్యూరిటీ అందుబాటులో ఉండాలన్నారు. ప్రస్తుతం అక్కడ ఆరుగురు విధులు నిరహిస్తున్నారని, పెట్రో కార్ కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. డీఎస్పీ వెంట సీఐలు సునీల్, కరుణాకర్‌రావు, ఎస్సై విష్ణువర్థన్ ఉన్నారు.