10-07-2025 12:19:53 AM
నాగార్జునసాగర్ బుద్ధవనంలో నిర్వహణ
నాగార్జునసాగర్, జూలై 9: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో తెలంగాణ టూరిజం శాఖ నిర్మించిన బుద్ధవనంలో గురువా రం ధర్మచక్ర పరివర్తన దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. గయలో సిద్ధార్థుడు జ్ఞానోదయం పొందిన తర్వాత బుద్ధుడిగా ఉత్తర ప్రదేశ్‌లోని సారనాథ్ జింకల వనంలో ఆషా డ పౌర్ణమి రోజున మొదటిసారిగా తన శి ష్యులకు ఉపన్యాసాన్ని ఇచ్చారు.
బౌద్ధులు, బౌద్ధ అభిమానులు ఈరోజుని ఎంతో పర్వదినంగా భావించి బుద్ధుడి జీవితంలో ము ఖ్య ఘట్టాల్లో ఒకటిగా ధర్మచక్ర ప్రవర్తన దినోత్సవంగా జరుపుకుంటారు. వేడుకకు మహాబోధి బుద్ధ విహార బౌద్ధ భిక్షువులు, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.