10-07-2025 12:30:59 PM
చిట్యాల,(విజయక్రాంతి): బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన రామచందర్ రావును(Ramachander Rao) చిట్యాల మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్(Burra Venkatesh Goud) గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందించి..శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి గ్రామస్థాయి నుండి బిజెపిని పటిష్టం చేయాలని సూచించినట్లు తెలిపారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుని వలె పని చేయాలని కోరారు.