10-07-2025 12:19:17 AM
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఖైరతాబాద్, జూలై 9 (విజయ క్రాంతి) : కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించి చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 15న బిసి ప్రజాప్రతినిధుల ఫోరం (బిసిపిఎఫ్) ఆద్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద నిర్వహించ తలపెట్టిన బిసిల మహాదర్నాను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్, తెలంగాణ రాష్ట్ర ఎంపిటిసిల ఫోరం ఆద్యక్షులు కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య ఆతిథులుగా శ్రీనివాస్ గౌడ్, రిటైర్డ్ ఐఎఎస్ టి.చిరంజీవులు, ఇతర బిసి సంఘాల నేతలు హాజరై ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..
బిసిలు కొన్ని దశాబ్దలుగా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తీవ్ర అన్యాయానికి గురవు తున్నారన్నారు. కాంగ్రె స్ ప్రభుత్వంలో డబ్బులేని శాఖలు బలహీన వర్గాలకిచ్చి, ఆదాయం ఉన్న శాఖలు అగ్రవర్ణాలు తీసుకొన్నాయని విమర్శించారు.
ఇకనైనా బీసీలంతా ఒక తాటిపైకి వచ్చి తమ హక్కుల సాధనకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బిసి సంఘం నేతలు ప్రణీత్ చౌదరి, బాలగోని బాల్రాజ్ గౌడ్, కెవి గౌడ్, పొన్నం దేవరాజ్ గౌడ్ తది తరులు పాల్గొన్నారు.