13 July, 2026 | 12:18 AM

నేడు ఐఎస్‌ఎల్ ఫైనల్

04-05-2024 12:45 AM

కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) 2023 సీజన్ తుది అంకానికి చేరుకుంది. శనివారం జరగనున్న ఫైనల్లో డిఫెండింగ్ చాంపి యన్ మోహన్ బగాన్ జట్టు, ముంబై సిటీ ఎఫ్‌సీ అమితుమీ తేల్చుకోనున్నా యి. ఫైనల్ మ్యాచ్‌కు కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియం వేదిక కానుంది. రెండు సూపర్ జట్ల మధ్య తుది పోరు జరగనుండడంతో స్టేడియం (62 వేలు సామర్థ్యం) అభిమానులతో నిం డిపోయే అవకాశముంది. రెండు వారాల క్రితం జరిగిన ‘లీగ్ విన్నర్  షీల్డ్’ ఫైనల్లో మోహన్ బగాన్ విజేతగా నిలిచింది.