నేడు విలువల్లేని రాజకీయాలు
- ప్రజలు గుణం చూసి ఓటేయాలి
- అణు పరీక్షల ధీశాలి వాజ్‌పేయి
- ఆయన నేటి తరానికి ఆదర్శం
- మనం ఎన్నడూ ఇతర దేశాలపై దండెత్తలేదు
- మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఖమ్మం,/రఘునాథపాలెం, మార్చి 1(విజయక్రాంతి): జనసంఘ్, కమ్యూనిస్ట్, కాం గ్రెస్, స్వతంత్ర పార్టీ వంటి రాజకీయ పక్షాలకు ఒకప్పుడు నిర్దిష్టమైన సిద్ధాంతాలు ఉండేవని, నేటి రాజకీయాల్లో ఆ సిద్ధాంతాలు పూర్తిగా లోపించాయని మాజీ ఉపరా ష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గుణం చూసే ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తక్షణ ఆహారంతో నిరంతర రోగాలు వెంటాడుతాయని, అమ్మను పరభాషలో పిలిస్తే శవంతో సమానమని, క్రమశిక్షణే అత్యున్నత పదవులకు సోపానం అని ఆయన స్పష్టం చేశారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని అద్భుతమైన వక్త, రచయిత, కవి, ప్రజాస్వామ్యవాది, గొప్ప దేశభ క్తుడు అని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కొనియాడారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన వాజ్‌పేయి శతజ యంతి పుస్తకావిష్కరణ సభలో ముఖ్యఅతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లా డారు.
పదవుల కోసం పీఠాల కోసం వాజ్‌పేయి ఎప్పుడూ పోటీపడలేదని, ఓటమిని సైతం అత్యంత హుందాగా స్వీకరించిన గొప ్ప వ్యక్తిత్వం ఆయన సొంతం అని స్పష్టం చేశారు. వాజ్‌పేయి హయాంలోనే దేశవ్యాప్తంగా స్వర్ణచతుర్భుజి రహదారుల నిర్మా ణం, గ్రామీణ రహదారుల అనుసంధానం, సమాచార ప్రసార రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని గుర్తుచేశారు. ప్రపం చ దేశాల ఆంక్షలను ఏ మాత్రం లెక్కచేయకుండా రాజీలేని ధోరణితో పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించిన ధీశాలి వాజ్‌పేయి అని ఉద్ఘాటించారు.
వాజ్‌పేయి పాలనా దక్షత, నిస్వా ర్థ సేవ నేటి తరానికి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. నాయకులు కేవ లం అవకాశవాదంతో పార్టీలు మారుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కులం కన్నా గుణం మిన్న అని స్పష్టం చేస్తూ రాజకీయాల్లో కులం, ధనం, మతం, నేరచరిత్ర ఆధారంగా కాకుండా నాయకుడి వ్యక్తి త్వం, సామర్థ్యం, యోగ్యత, ప్రవర్తన చూసి ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని సూచించారు.
హిందుత్వం అంటే ఒక ఇరుకైన మతం కాదని, ఎవరినీ ద్వేషించని ఒక గొప్ప జీవన విధానమని వివరించారు. భారతదేశం ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యధిక వాటాను కలిగి ఉండి, విశ్వగురువుగా వెలుగొందిందని, మన దేశం సుదీర్ఘ చరిత్రలో ఎప్పుడూ ఇతర దేశాలపై దండెత్తలేదన్నారు. భారతీయ సనాతన ధర్మం సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని కోరుకుంటుందని ఉద్ఘాటించారు. విలువలతో కూడిన రాజకీయాలు మాత్రమే దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలవని ఆయ న విశ్లేషించారు.
ప్రతి ఇంట్లో పిల్లలు తప్పనిసరిగా మాతృభాషలోనే మాట్లాడాలని స్పష్టం చేశారు. అమ్మ, నాన్న అని పిలవడంలో ఉన్న కమ్మదనం ఆంగ్ల పదాల్లో ఏమాత్రం లేదని చురకలంటించారు. తాత్కాలిక రుచుల కోసం పాశ్చాత్య ఆహారపు అలవాట్లకు బానిసలైతే భవిష్యత్తులో నిరంతరం దీర్ఘకాలిక రోగాల బారిన పడక తప్పద ని హెచ్చరించారు.
తన జీవితం ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి ప్రారంభమైంద ని, చిన్న వయసులో ఆటలు ఆడటానికి రాష్ట్రీ య స్వయం సేవక్ సంఘ్ శాఖకు వెళ్లడం ద్వారా తనలో క్రమశిక్షణ, దేశభక్తి మొలకెత్తాయని ఆయన తన గతాన్ని నెమరువేసుకు న్నారు. నేర్చుకునే తపన, వినయం ఉంటే ఎంతటి ఎత్తునా ఎదగవచ్చన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ నేటి రాజకీయాలపై అసహనంవ్యక్తం చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని అన్ని రాజకీయ పక్షాల నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. నేటి రాజకీయాల్లో బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు.




