వినియోగంలోకి మరుగుదొడ్లు
నాగల్‌గిద్ద, నవంబర్ 30: నాగల్‌గిద్ద మండలంలోని ఎస్గీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రూ.లక్షలు ఖర్చుచేసి నిర్మించిన మరుగుదొడ్లకు ఉపాధ్యాయులు తాళం వేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయమై విజయక్రాంతి దినపత్రికలో శనివారం ప్రచురితమైన వార్తా కథనానికి అధికారులు స్పందించారు.
ఈవిషయమై సంబంధిత స్కూల్‌లో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అధికారి ఆదేశాల మేరకు నాగల్‌గిద్ద మండలంలోని ఎస్గీ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను కాంప్లెక్స్ హెచ్‌ఎం రవీందర్‌రావు తనిఖీ చేసి తాళంవేసి ఉన్న మరుగుదొడ్లను విద్యార్థులు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు.
మరుగు దొడ్ల్లను కేవలం ఉపాధ్యాయులే వినియోగించుకుంటూ విద్యార్థులకు అనుమతి ఇవ్వక పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమస్య పరిష్కారినికి సహకరించిన విజయక్రాంతికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.




