13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఆటే నా పొగరు!

28-03-2026 02:19 AM

టాలీవుడ్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటిం గ్స్ సమర్పిస్తున్నాయి. జా న్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శుక్రవా రం శ్రీరామ నవమి. అంతేకాక హీరో రామ్‌చరణ్ పుట్టిన రోజు కూడా. దీంతో ఈ మూవీ మేకర్స్ అభిమానులకు ఒక అద్భుతమైన కానుకను అందించారు.

‘పెద్ది పహిల్వాన్’ పేరుతో విడుదల చేసిన గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ‘కుస్తీ అంటే బంతితో బ్యాటుకు ఎదురెళ్లే ఆట కాదురా.. పాణం తో సావుకు ఎదురెళ్లే ఆట’ అనే డైలాగ్‌తో ఈ గ్లింప్స్ మొదలైంది. ఇందులో రామ్‌చరణ్‌ను గధ యుద్ధవిద్యలో ప్రావీణ్యం సంపాదిస్తున్న పహిల్వాన్‌గా ఎంతో శక్తిమంతమైన లుక్‌లో చూపించారు.

ఇక ఈ వీడియోలో రామ్‌చరణ్ ట్రాన్స్‌ఫర్మేషన్ మెస్మరైజింగ్‌గా ఉంది. సిక్స్-ప్యాక్ అబ్స్, దృఢమైన కండరాలు, ఇంటెన్స్ ప్రజెన్స్‌తో నిజమైన పహిల్వాన్‌గా ఒదిగిపోయారు. రామ్‌చరణ్ గధను పట్టుకొని హనుమంతుడిలా కనిపించిన సన్నివేశం మరో స్థాయిలో ఉంది. చివరగా రామ్‌చరణ్ ‘చూడుమే, ఆటే నా పోగరు..’ అంటూ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.  ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చుతుండగా,  ఆర్ రత్నవేలు డీవోపీగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.