15 July, 2026 | 1:01 AM

సైలెంట్‌గా పెళ్లిపీటలెక్కిన టాలీవుడ్ జంట

09-12-2024 12:00 AM

టాలీవుడ్‌కు చెందిన మరో జంట సైలెంట్‌గా పెళ్లిపీటలెక్కేసింది. ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్, నటి చాందినీరావు మూడు ముళ్ల బంధం లోకి అడుగుపెట్టారు. శనివారం వీరి వివాహం తిరుమలలో జరిగింది. ‘కలర్ ఫోటో’ చిత్రంలో చాందినీరావు ఓ చిన్న పాత్ర పోషించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే సందీప్, చాందినీల మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. శనివారం ఇరువైపుల పెద్దల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు.

షార్ట్ ఫిల్మ్‌లతో కెరీర్ ప్రారంభించిన సందీప్ రాజ్‌కు ‘కలర్ ఫోటో’ చిత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా ఉత్తమ తెలుగు చిత్రం విభాగంలో జాతీయ పురస్కారం సైతం కైవసం చేసుకుంది. ప్రస్తుతం సందీప్ రాజీవ్ కనకాల తనయుడు రోషన్‌తో ‘మోగ్లీ’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.