ప్రజాసమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం
ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్, జూలై 9 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రజాసమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. ఏజీకాలనీ డివిజన్ పరిధిలోని వీడియో గల్లీలో ఆయన గురువారం పర్యటించారు. ఇటీవల కురసిన వర్షాల కారణంగా ఓ ఇంటిలో మురుగునీరు నిలిచాయి. పర్యటనలో భాగంగా ఆ ఇంటిని స్వయంగా పరిశీలించారు. సమస్యను తక్షణమే పరిశీలించాలని సంబంధిత అధికారులను ఫోన్ కాల్ ద్వారా ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశామన్నారు. ప్రజలకు తానెల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీనిచ్చారు. ప్రతి ప్రజాసమస్యను తన సమస్యగా భావించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. ప్రజలకు ప్రజాప్రతినిధిగా మెరుగైన సేవలను అందించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






