13-10-2025 08:26:01 AM
నీట మునిగిన కాలనీలు
పొంగిన డ్రైనేజీలు
ఇళ్లలోకి చేరిన వరద నీరు
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల(Valigonda Mandal) కేంద్రంలో సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు నుండి 7 గంటల వరకు కురిసిన కుండ పోత వర్షంతో(Rain) వలిగొండ వర్షపు నీటితో నిండిపోయింది. భారీ వర్షం కారణంగా మండల కేంద్రంలోని పలు కాలనీలు నీట మునగగా డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ఒక కాలనీలో వర్షపు నీరు నడుము లోతు ప్రవహించగా వరద ఇళ్లలోకి చేరింది. దీంతో కాలనీవాసులు బిక్కుబిక్కుమంటూ తెల్లవారే వరకు గడిపారు. ఇళ్లలోకి నీరు చేయడంతో ఇండ్లలోని వస్తువులని తడిసి ముద్ద కాగా, మహిళలు, పురుషులు, పిల్లలు ఇండ్లలోకి చేరిన నీటిని బకెట్లతో తోడి బయట పారబోయడం కనిపించింది. అదేవిధంగా భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై వలిగొండ మండల కేంద్రంలో నిర్మిస్తున్న కల్వర్టు వద్ద వర్షం నీరు పెద్ద ఎత్తున ప్రవహించింది.