calender_icon.png 13 October, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివేక్ x అడ్లూరి

13-10-2025 01:48:33 AM

- కుట్రపన్ని అపఖ్యాతి పాల్జేస్తుండ్రు

- మంత్రి లక్ష్మణ్ విషయంలో కావాలనే నాపై విమర్శలు

- అడ్లూరిని ప్రోత్సహించింది.. గడ్డం వెంకటస్వామినే: మంత్రి వివేక్

-పార్టీ గీత దాటను.. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా..

-నిజామాబాద్ సభలో వివేక్ నా పేరు ప్రస్తావించడం సరికాదు

-మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

నిజామాబాద్/జగిత్యాల అక్టోబర్ 12: (విజయక్రాంతి): రాష్ట్రంలో మంత్రుల మధ్య మాటల యుద్ధం సద్దుమణిగిందనుకున్న తరుణం.. తనపై కుట్రలు పన్ను తూ అపఖ్యాతి పాల్జేస్తున్నారంటూ మంత్రి వివేక్ చర్చకు మళ్లీ తెరలేపారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను ఎవరో వెనుకుండి మాట్లాడిస్తున్నారని పేర్కొన్నారు.

ఆయన రాగానే తాను లేచి వెళ్లిపోతున్నాననేది నిజం కాదని చెప్పారు. అడ్లూరిని ప్రోత్సహించింది తన తండ్రి వెంకటస్వామేనని తెలిపారు. ఈ విషయంలో స్పందించిన మంత్రి అడ్లూరి అంతర్గత చర్చను బాహాటంగా వెల్లడించడం సరికాదని, నిజామా బాద్ సభలో వివేక్ తన పేరు ప్రస్తావించడం సరికాదన్నారు. తాను పార్టీ గీత దాటనని, ఈ విషయాన్ని వివేక్ విజ్ఞతకే వదిలేస్తున్నట్టు పేర్కొన్నారు.

పదవిపై వ్యామోహం లేదు: వివేక్

వ్యాపారాలు చేసుకుంటూ నిజాయితీగా బతుకుతున్నా.. అయినా తనపై కొందరు కక్ష కట్టారు.. మంత్రి లక్ష్మణ్ విషయంలో కావాలనే విమర్శలు గుప్పిస్తుండ్రు.. కుట్రపన్ని తనను అపఖ్యాతి పాలు చేయాలని చూస్తుం డ్రు అని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆవేదనవ్యక్తం చేశారు.

ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దివంగత నేత గడ్డం వెంకటస్వామి జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై తన ఆవేదనను వెలిబుచ్చారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను రాజకీయంగా ప్రోత్సహించింది.. గడ్డం వెంకటస్వామి అని గుర్తుచేశా రు. అయినా, మంత్రి లక్ష్మణ్ తనపై కావాలనే విమర్శలు చేస్తున్నారని వాపోయారు. ఆయన రాగానే తాను వెళ్లిపోతున్నాననేది నిజం కాదని చెప్పారు.

మంత్రి పదవి అంటే తనకు మోజు లేదని పేర్కొన్నారు. పార్టీ అధిష్ఠానం తనకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి కష్టపడి పనిచేస్తున్నానని వెల్లడించారు. అక్కడ కాం గ్రెస్‌కు ఓటింగ్ శాతం కూడా పెరిగిందని.. ఇది గిట్టని ఓ వర్గం మీడియా తన ను టార్గె ట్ చేసిందని తెలిపారు. అక్కడ కాం గ్రెస్ గెలి స్తే తనకు మంచి పేరువస్తుందని వారికి అక్కసు అని ఆవేదన వ్యక్తంచేశారు. దేశం లో ఇంకా కుల వివక్ష కొనసాగుతోందని తెలిపారు. 

అంతర్గత చర్చను బాహాటంగా చెప్పడం సరికాదు: అడ్లూరి 

తాను పార్టీ గీత దాటి మాట్లాడనని, నిజామాబాద్‌లో మంత్రి వివేక్ చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకు, మర్యాదకు వదిలేస్తున్నానని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. సహచర మం త్రి వివేక్ చేసిన వ్యాఖ్యలపై  మంత్రి అడ్లూరి ఆదివారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో స్పం దించారు. 

మంత్రి పొన్నం తనను అన్న మా టల గురించి వివేక్ ఫోన్ చేసి చెప్తాడని అనుకున్నానని.. మరుసటి రోజు కూడా వివేక్ తనకు కాల్ చేయకపోవడం బాధ కలిగించిందన్నారు. నిజామాబాద్ సభలో తన పేరును ప్రస్తావించడం కూడా సరికాదని, అంతర్గతంగా చర్చించిన విషయాలను బాహాటంగా వెల్లడించిన తీరు అభ్యంతరకరమన్నారు.