చారిత్రక ప్రగతిదిశగా టూరిజం
చారిత్రాత్మక అంశాలకు ప్రసిద్ధిగాంచిన తెలంగాణ రాష్ట్రాన్ని పర్యాటక రంగంగా తీర్చిదిద్దేందుకు ప్రభు త్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం ఆహ్వానించదగ్గ పరిణామం. రాష్ట్రంలో పలు పర్యాటక, ప్రకృతి, ఆధ్యాత్మిక ప్రాంతాల ఔన్నత్యాన్ని గుర్తిస్తూ పర్యాటక రం గంలో తెలంగాణను అభివృద్ధి పరచాలనే సంకల్పంతో రాష్ట్ర కేబినెట్ నూతన పర్యాటక విధానానికి ఆమోదం తెలపడం ఒక చారిత్రాత్మక ఘట్టం.
ఎంతో ఘనమైన చరి త్ర కలిగి నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ పర్యాటక రంగాన్ని ఆలస్యమైనా తొలిసారి గా పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నూతనంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకో వడం సంతోషకరం. ఇప్పటివరకు రాష్ట్రం లో పర్యాటక రంగానికి సంబంధించి ఒక ప్రత్యేక పాలసీ లేని నేపథ్యంలో ఏప్రిల్ నుంచి అమలులోకి రానున్న తెలంగాణ తొలి పర్యాటక పాలసీతో పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
గత డిసెంబర్‌లోనే ముసాయిదా
తెలంగాణకు 2500 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. పురాతన రాతియుగం నుంచి ఉనికిలోకి వచ్చిన తెలంగాణ గడ్డపై మౌర్యులు, శాతవాహనులు, బాదామి చాళుక్య, రాష్ట్రకూటులు, కాకతీయులు, ఆసఫ్ జాహీలు, నిజాం కాలాల నుంచి ఉన్న చారిత్రాత్మక ప్రదేశాలను ఈ కొత్త పాలసీ విధానంతో పర్యాటక రంగంగా అభివృద్ధి పర్చాలనే గట్టి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం 2024 డిసెంబర్‌లో ఒక ముసాయిదాను తయారు చేసి శాసనసభ, శాసన మండలిలో చర్చకు పెట్టడంతో తొలి అడుగు పడ్డట్టయ్యింది.
ఇప్పటికే దేశంలో పర్యాటక రంగంలో పలు రాష్ట్రాలు పోటీ పడు తున్న నేపథ్యంలో తెలంగాణ వైపు పర్యాటకులను, పెట్టుబడులను ఆకర్షించేలా ప్రభుత్వం దేశ, విదేశీ పర్యాటక పాలసీలను అధ్యయనం చేసింది. దక్షిణ భారత దేశంలో అన్ని రాష్ట్రాలు పర్యాటక రంగం లో లాభాలు ఆర్జిస్తున్న దశలో వీరందిరి తో పోటీ పడేలా పెట్టుబడులను ఆకర్షించేందుకు రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పిస్తూ నూతన పాలసీని తయారుచేశా రు.
తొలి పర్యాటక పాలసీ రూపకల్పనపై ప్రభుత్వం అన్ని వర్గాలతో చర్చలు జరిపి 20252030 దాకా అమలులో ఉండేలా దీన్ని రూపొందించింది. ఈ కొత్త పాలసీపై రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, రాష్ట్రంలో 3 లక్షలకు పైగా ఉపాధి కల్పి ంచాలనే లక్ష్యంతో తెలంగాణ పర్యాటక శాఖ అడుగులు వేస్త్తోంది.
రాష్ట్రంలో ప్రకృతిపరమైన, ఆధ్యాత్మిక, చారిత్రక ప్రదేశాలు ఎక్కడున్నాయో, ఆ ప్రాంతాల్లో భోజన, రవాణా, వసతితో పాటు ఇతర సౌకర్యాల సమాచారం సులభంగా అందుబాటులో ఉండేలా తెలంగా ణ టూరిజం పోర్టల్ ఏర్పాటు చేయనున్నారు.
పర్యాటకులను ఆకర్షించేలా చారిత్రాత్మక యుద్ధాలు జరిగిన ప్రదేశాలు, కోట లు, కట్టడాలను తీర్చిదిద్దనున్నారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రాజెక్టుల స్థాయిని బట్టి ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి కనిష్టంగా 15-33 సంవత్సరాలు, గరిష్ఠంగా 66 ఏండ్ల పాటు లీజుకివ్వాలని పాలసీలో నిర్ణయించడంతో పెట్టుబడుదారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
పబ్లిక్‌ప్రైవేట్ భాగస్వామ్యం
పెట్టుబడుదారులను ఆకర్షించేందుకు రూ.500 కోట్లుకుపైగా పెట్టుబడులు లేదా 200 మందికిపైగా ఉపాధి కల్పిస్తే ఐకానిక్ ప్రాజెక్టుగా, రూ.100 కోట్లకు పైగా పెట్టుబడులు లేదా 500 మందికిపైగా ఉపాధి కల్పిస్తే మెగా ప్రాజెక్టుగా నూతన పాలసీ లో వర్గీకరించారు. పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుండడంతో పనులు మరింత వేగవంతంగా సాగే అవకాశాలున్నాయి.
ప్రస్తు త కాలంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న అడ్వెంచర్ టూరిజం, హౌస్ బోట్లు, వేసైడ్ ఎనిమిటీస్ మొదలగువాటిపై పెట్టుబడుల కోసం రాయితీలు ఇచ్చేలా పాలసీని రూపొందించారు. పర్యాటక నూతన పాలసీలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తారు. ఇప్పటికే 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను గుర్తిం చి, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా వికారాబాద్‌లోని అనంత గిరి, కోట్పల్లి, పరిగి, దామగూడెం ప్రాంతాలను ప్రకృతి సందర్శన, సాహస క్రీడలు, ఆరోగ్యం పర్యాటక స్థలాలుగా, నల్లమల్ల సమీపంలోని కృష్ణానది బ్యాక్ వాటర్ ప్రాంతం, అలంపూర్ శక్తి పీఠం, సోమశిల, కొల్లాపూర్, బీచ్‌పల్లితో పాటు అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఏరియా, అక్కడున్న జలపాతాలను, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంతోపాటు లక్నవరం, మేడారం, బొగత జలపాతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి పరుస్తారు. కాళేశ్వరాన్ని ప్రకృతి, వారాంతపు పర్యాటక స్థలంగా తీర్చిదిద్దుతారు.
నాగార్జునసాగర్ వద్ద బౌద్ధ వారసత్వం, ప్రకృతి, సాహస క్రీడల ప్రాంతాలుగా అభివృద్ధి చేయనున్నారు. దక్షిణాది ప్రాంతంలో అనేక ప్రత్యే కతలతో కూడిన ఒక బుద్ధిస్ట్ సర్క్యూట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది.
భద్రాచలంలో రామాలయంతో పాటు పర్ణశాల, కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం, కిన్నెరసాని రిజర్వాయర్, ఆధ్యాత్మిక, ట్రైబల్ టూరిజం అభివృద్ధి, జోడేఘాట్, ఉట్నూరు, కేస్లాగూడ అభయారణ్యం, జలపాతాలను గిరి జన పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి
నాలుగు వందల ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన హైదరాబాద్ పట్టణానికి పర్యాటక పాలసీలో అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నా రు. చారిత్రాత్మకమైన చార్మినార్‌తోపాటు దాని సమీపంలోనే ఉన్న లాడ్‌బజార్, మక్కా మసీద్, చౌమొహల్లా ప్యాలెస్, సాలార్‌జంగ్ మ్యూజియం, నిజాం మ్యూ జియం అభివృద్ధితో పాటు గోల్కొండ కోట ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి పర్యాటక పాలసీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ వెలుపల దాదాపు వెయ్యి ఎకరాలలో నూతన జూపార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం పర్యాటక రంగానికి మరిం త ప్రోత్సాహానిచ్చింది. నగరానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్ట దేవాలయానికి టీటీడీ తరహాలో పాలకమండలి ఏర్పాటు చేసి భక్తులకు పలు సౌకర్యాలు కల్పించడంతో పాటు అక్కడ పర్యాటక అభివృద్ధి కోసం కృషి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రాంతా లు మరింత వేగవంతంగా పురోగతి సాధించే అవకాశాలున్నాయి. శంషాబాద్ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి పరిచేలా ప్రభుత్వం పాలసీలో చర్యలు తీసుకుంది.
పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర పర్యాటక ప్రోత్సాహక మండలిని ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మండలికి ముఖ్యమంత్రి అధ్యక్షుడుగా, మంత్రులు సభ్యులుగా, పర్యాటక ముఖ్య కార్యదర్శి కన్వీనర్‌గా ఉండడంతో కీలకమైన నిర్ణయాలను వేగవంతంగా తీసుకునే అవకాశాలుంటాయి.
రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి టూరి జం, దేవాదాయ శాఖలు సంయుక్తంగా ముందుకెళ్లాలని సూచించడంతో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపం లేకుం డా వేగవంతంగా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. పర్యాటక రంగంలో దేశం లో మొదటి ఐదు రాష్ట్రాలో తెలంగాణ నిలబెట్టడంతోపాటు, రాష్ట్ర జీడీపీలో 10 శాతం కంటే ఎక్కువ ఆదాయం లభించేలా తెలంగాణ పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది.
ఎన్నో చారిత్రక ప్రదేశాలు, ఆధ్యా త్మిక ప్రాంతాలు ఉన్నా పర్యాటక రంగం లో ఇంతకాలం వెనుకబడిన తెలంగాణలో ప్రభుత్వం ఇప్పుడు పర్యాటక అభివృద్ధికి నూతన పర్యాటక విధానాలకు శ్రీకారం చుట్టడంతో రాష్ట్రంలో టూరిజం కొత్త పుంతలు తొక్కుతూ పరుగులు పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.






