31 August, 2026 | 10:15 PM

Breaking News

కొమరం భీమ్ నగర్ గ్రామంలో త్రాగునీటి సమస్య కు పరిష్కారం చూపండి   •   ప్రజల సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్యం   •   ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకే జాగో తెలంగాణ యాత్ర   •   ఆదివాసి బిడ్డ శిరీషపై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను శిక్షించాలి   •   సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి   •   పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలి   •   బిజెపి నాయకులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి   •   మహబూబ్‌నగర్–డోన్ రైల్వే డబుల్ లైన్‌కు భూసేకరణ త్వరలో పూర్తి   •   కాంగ్రెస్‌ను ప్రజా కోర్టులో దోషిగా నిలబెడతాం.!   •   24 గంటల విద్యుత్‌ కోసం రైతుల ధర్నా   •  

ఈజీగా టచ్ చేయడానికి ఆటబొమ్మలమా?

02-06-2025 01:06 AM

ఎంత నటీమణి అయినా ఆమె పరాయి మహిళ అన్న సంగతిని మగవారు మర్చిపోతారు. ఆమెతో కరచాలనం చేసేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తుంటారు. అయితే, అలా వ్యవహరించడం తప్పు అంటోంది ప్రముఖ నటి నిత్యామీనన్. కొన్ని రోజుల క్రితం ఓ ఈవెంట్‌కు వెళ్లిన నిత్యామీనన్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడో అభిమాని. అప్పుడు నిత్యా తనకు జలుబు చేసిందని చెప్పి, అతనికి నమస్కరించి అతని ముందు నుంచి కదిలింది.

వెంటనే వేదికపై ఉన్న నటుడిని కౌగిలించుకొని షేక్‌హ్యాండ్ ఇచ్చింది. దీంతో అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ నిత్యామీనన్‌ను ట్రోల్ చేశారు నెటిజన్స్. తాజాగా నిత్యా దీనికి కౌంటర్ ఇచ్చింది. ‘మేము ఏ కార్యక్రమంలో పాల్గొననా షేక్‌హ్యాండ్ అంటూ మమ్మల్ని టచ్ చేయడానికి ఎగబడతారు.

మమ్మల్ని అడిగినట్టే.. సాధారణ మహిళలను కరచాలనం అడుగుతున్నారా? అలా ఈజీగా టచ్ చేయడానికి మేమైనా ఆటబొమ్మలమా?’ అంటూ ప్రశ్నించింది. నిత్యామీనన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిత్యామీనన్ సినిమాల విషయానికొస్తే.. ఆమె ప్రస్తుతం ధనుష్ సరసన ‘ఇడ్లీ కడై’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ‘తలైవన్ తలైవి’లోనూ విజయ్ సేతుపతికి జంటగా నటిస్తోంది.