05-01-2026 12:00:00 AM
టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్
కామారెడ్డి, జనవరి 4 (విజయక్రాంతి): ఉపాధ్యాయ సమస్యలపై టీపీటీఎఫ్ నిరంతర పోరాటం చేస్తుందని టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో టీపీటీఎఫ్ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు సకినాల అనిల్ కుమార్, విశిష్ట అతిథిగా సీనియర్ ఫెడరేషన్ నాయకులు టి హనుమాండ్లు హాజరై టిపిటిఎఫ్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఉపాధ్యాయుల సమస్యలు వాటి పరిష్కారం కోసమని ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఉద్దేశంతో కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల కోసం పోరడుతూ గతంలో పప్పు, అన్నం లాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఫెడరేషన్ సీనియర్ నాయకులు హన్మాండ్లు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఫెడరేషన్లో అంకితభావంతో పనిచేయాలన్నారు.
కార్యక్రమంలో భాగంగా సావిత్రిబాయి పూలే జయంతిని నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై టీపీటీఫ్ ఎప్పుడూ పోరాడుతుందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్ రెడ్డి,మాట్లాడుతూ అంకితభావంతో పనిచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సీనియర్ నాయకులు కందుకూరి శ్రీనివాస్, లచ్చయ్య, అంజయ్య, వెంకట్రాం రెడ్డి, అశోక్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ వి శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు నళిని దేవి, జిల్లా కార్యదర్శులు నరేందర్, నాగభూషణం, లక్ష్మి శ్రీవాణి, మంగమ్మ, హిరణ్మయి, మీనా భూషణ్, మాచారెడ్డి ప్రధాన కార్యదర్శి వెంకటేష్, రాజంపేట బాధ్యులు సునీల్ తదితరులు పాల్గొన్నారు.