calender_icon.png 8 January, 2026 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేషన్ ఓటర్ లిస్టులో స్థానికేతరుల పేర్లు

05-01-2026 12:00:00 AM

ఓటర్ లిస్టును సరిచేయండి లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం 

నిజామాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి 

నిజామాబాద్ జనవరి 4 (విజయ క్రాంతి): నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై పట్టు సాధించి బిజెపి జెండా ఎగురవేస్తామని భయంతో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు కుట్ర చేస్తున్నారని బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి ఆరోపించారు. శుక్రవారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ను ఆయన కలిశారు. రానున్న మున్సి పల్ ఎన్నికల నేపద్యంలో ఓటర్ లిస్టులో అనేక అనుమానాస్పద అంశాలు ఉన్నాయని జిల్లాకు సంబంధం లేని వ్యక్తులను ఓటర్ లిస్టులలో చేరుస్తున్నారని ఈ విషయాలు తమ దృష్టికి వచ్చాయని. ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే చర్యగా స్థానికేతరులను అనేకమందిని ఓటర్ లిస్ట్ లో చేర్చడం అప్రజా స్వామీకమని ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకే కుట్ట జరుగుతోందని ఆయన ఆరోపించారు.

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భారతీయ జనతా పార్టీకి లభిస్తున్న ఆదరణను చూసి దురుద్దేశంతోటే భారతీయ జనతా పార్టీ ఆధిపత్యాన్ని దెబ్బతీసే విధంగా స్థానికేతులను ఓటర్ లిస్టులో చేరుస్తున్నారని ఆయన మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఈ కుట్రాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన నిజామాబాద్ నగరం కార్పొరేషన్ పై బిజెపి జెండా ఎగరడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత ఓటర్ లిస్టు పూర్తిగా తప్పులతడకగా ఉందని ఆయన ఆరోపించారు. ఇతర జిల్లాల వ్యక్తులకు అర్బ న్ ఎన్నికల ఓటర్ లిస్టులతో ఏ విధమైన సంబంధం ఉంటుందని ప్రశ్నించారు.

వెంట నే ఈ తప్పులను సరిచేయాలని లేదా భారతీయ జనతా పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయి స్తుందని ఆయన హెచ్చరిం చారు. ఈనెల 5లోపు అన్ని డివిజన్లో లోని ఓటర్ లిస్టులను సరిచేయాలని మున్సిపల్ కమిషనర్ని దినేష్ కులచారి కోరారు. ఈ విషయమై నిజామాబాద్ ఎంపీ అరవింద్ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో కలిసి కమిషనర్ కు ఫోన్‌లో మాట్లాడించరు. మున్సిపల్ కమిషనర్‌ని కలిసిన దివ్యశ్రెడ్డితోపాటు బిజె పి జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, నాగోల్ల లక్ష్మీనారాయణ కార్యదర్శి దంపల్లి జ్యోతి మాజీ కార్పొరేటర్లు మండల అధ్యక్షులు ప్రమోద్ బంధం కిషన్ ఇప్పకాయల కిషోర్ వినోద్ రెడ్డి మల్లేష్ గుప్తా బూరుగుల వినోద్ గడ్డం రాజు తారక్ వేణు అంపదాస్ రావు శ్రీనివాస్ రెడ్డి శంకర్ రెడ్డి సంతోష్ ఆనంద్ విజయ కృష్ణ ఉన్నారు.