05-01-2026 12:00:00 AM
గాంధారి, జనవరి 4 (విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పోతంగల్ కలాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి చెందిన విద్యార్ధి అబ్దుల్ అలియా నారాయణ పెట్ జిల్లా లో జరిగిన U/14 ఇయర్స్ హ్యాండ్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లా జట్టు కు నాయకత్వం వహిస్తూ జట్టు తృతీయ స్థానం సాధించడంలో కీలక పాత్ర వహించడంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫీజికల్ డైరెక్టర్ నాగరాజు తెలిపారు. విద్యార్థిని పాఠశాల ఉపాధ్యా య బృందం మరియు గ్రామసర్పంచ్ అనుశ్రీ బాల్ రాజు, గ్రామస్తులు అభినందించారు.