15 April, 2026 | 7:56 AM

అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్

12-11-2025 10:19 PM

చిట్యాల (విజయక్రాంతి): రామన్నపేట మండలం శోభనాద్రిపురం గ్రామా శివారులో ఉన్న మూసి వాగు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను రామన్నపేట పోలీసులు సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారం రావటంతో రామన్నపేట పోలీసులు శోభనాద్రిపురం గ్రామ శివారులు తనిఖీలు నిర్వహించగా రెండు ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఇసుక ట్రాక్టర్ లో రవాణా చేస్తున్న వారిని విచారించగా ఎటువంటి అనుమతులు లేవని గుర్తించి ట్రాక్టర్లను సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రామన్నపేట ఎస్సై డి నాగరాజు తెలియజేశారు. ఏవరైన ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా మూసి వాగు నుండి ఇసుకను తరలిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.