calender_icon.png 12 November, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానస్పద స్థితిలో మహిళ మృతి

12-11-2025 10:17:27 PM

వనపర్తి క్రైమ్: అనుమానస్పద స్థితిలో మహిళ మృతిచెందిన సంఘటన బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఎన్ టి ఆర్ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంగా వనపర్తి పట్టణంలోని నాగవరంకు చెందిన రేగు లక్ష్మి(45) ఎన్ టి ఆర్ కాలనిలో నివాసం ఉంటుందని మూడేళ్ల క్రితం భర్త తిరుమలేష్ చనిపోగా కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగించేకునేది కాగా బుధవారం సాయంత్రం ఆమె అనుమానస్పదంగా మృతిచెందడం కంటి ప్రాంతంలో గాయాలు ఉండడంతో చుట్టు పక్కల గల వారు పోలీసులకు సమాచారాన్ని అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు మృతికి గల కారణాలను సేకరిస్తున్నారు.