13 June, 2026 | 2:15 AM

కొత్తూరు వై-జంక్షన్ అండర్‌పాస్‌ను పరిశీలించిన ట్రాఫిక్ డీసీపీ శివమ్ ఉపాధ్యాయ్

13-06-2026 01:17 AM

షాద్నగర్, జూన్ 12(విజయక్రాంతి) కొత్తూరు వై-జంక్షన్ అండర్పాస్ వద్ద వర్షాకాలంలో తలెత్తే నీటి నిల్వ సమస్యలపై ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ డీసీపీ శివమ్ ఉపాధ్యాయ్ శుక్రవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. భారీ వర్షాలకు నీరు నిలిచి ద్విచక్ర వాహనదారులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, డ్రైనేజీ కాలువల్లోని వ్యర్థాలను తక్షణమే తొలగించాలని నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. అండర్పాస్లో నీటిమట్టం పెరిగినప్పుడు ట్రాఫిక్ను దారి మళ్లించాలని, అత్యవసర బృందాలతో సమన్వయం చేసుకోవాలని పోలీసులకు సూచించారు. వర్షాకాలంలో వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు నీటితో నిండిన అండర్పాస్ల గుండా వెళ్లకుండా జాగ్రత్తలు వహించాలని డీసీపీ ఈ సందర్భంగా ప్రజలను కోరారు.