17 April, 2026 | 9:02 PM

టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ

09-06-2025 12:59 AM

కొండపాక,జూన్ 08 : కొండపాక మండలం దుద్దెడ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ఆదివారం సాయంత్రం ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. సిద్దిపేట నుంచి హైదరాబాదుకు వెళ్తున్న వాహనాల సంఖ్య పెరిగింది.మరో రెండు రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కానుండడంతో సెలవులకు వచ్చివారు  హైదరాబాద్ కు తిరిగి వెళ్తుండడంతో వాహనాల రద్దీ పెరిగింది.సుమారు కిలో మీటరు దూరం వాహనాలు నిలిచిపోయాయి.