29-08-2025 08:44:50 AM
సదాశివనగర్,(విజయక్రాంతి): సదాశివనగర్ మండలంలోని కుప్రియల్ నుండి దగ్గి వరకు శుక్రవారం ఉదయం నిజామాబాద్ నుండి హైదరాబాదు(Nizamabad to Hyderabad) వెళ్లే జాతీయ రహదారి 44 పై ట్రాఫిక్ జామ్ అయింది. టేక్రియాల్ వద్ద జాతీయ రహదారి 44 పై ఉన్న బ్రిడ్జి వరద ఉధృతికి కూలిపోవడం తో వాహనాలు వెళ్లడానికి వీలు కాకుండా పోయింది. సదాశివ నగర్ ఎస్ఐ పుష్పరాజ్ సిబ్బందితో చేరుకొని ట్రాఫిక్ ను రామరెడ్డి రోడ్డు మీదుగా డైవర్ట్ చేశారు.