29-08-2025 05:52:25 AM
పోస్టర్ ఆవిష్కరించిన ‘మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్’ అధ్యక్షుడు
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 28 (విజయ క్రాంతి): పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న మధ్యాహ్నం రెండు గంటలకు నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను యూనియన్ అధ్యక్షుడు ఉదరి గోపాల్ గురువారం ఆవిష్కరించారు.
నగరపాలక సంస్థ పరిధిలోని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులందరూ ఈ సభలో పాల్గొని, పాత పెన్షన్ సాధన కోసం తమ పోరాటాన్ని ఉధృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సీపీఎస్ రద్దు చేయాలి, ఓపీఎస్ అమలు చేయాలి.. అనే నినాదంతో ఈ సభను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తమ డిమాండ్లను సాధించుకోవాలని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో యూనియన్ సభ్యులు డి. నర్సింగ్ రావు జనరల్ సెక్రటరీ, బి. కన్నా వర్కింగ్ ప్రెసిడెంట్, జి. నర్సింగ్ రావు వైస్ ప్రెసిడెంట్,ఎం. కృష్ణ వైస్ ప్రెసిడెంట్, కె. శేఖర్ వైస్ ప్రెసిడెంట్, సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.