calender_icon.png 3 February, 2026 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు సమస్య ఎవరికీ పట్టదా?

03-02-2026 02:32:01 AM

నిజాంపేట: ఫిబ్రవరి 2 గత రెండున్నర సంవత్సరాల నుండి రోడ్డు పై కంకర పోసి అర్ధవంతంగా నిలిపివేశారు. నిజాంపేట మండలం చల్మెడ కమాన్ నుండి నందగోకులు గ్రామం వరకు సుమారు 7 కిలో మీటర్ల రోడ్డు పాత తారు రోడ్డు తీసేసి కంకర పోసి వదిలేశారు. దీంతో ఈ రో డ్డు గుండా నిత్యం ప్రయాణాలు కొనసాగించే ఇరు గ్రామాల ప్రజలు ఇబ్బందులతో ప్రయాణా లు కొనసాగించాల్సి వస్తుందని వాపోతున్నారు.

గత ప్రభుత్వంలో ప్రారంభించిన రోడ్డుకు ఈ ప్రభుత్వంలో కూడా మోక్షం కలగడం లేదని గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత ఎమ్మెల్యే దృష్టి పెట్టి రోడ్డు వేయాలని వేడుకుంటున్నారు. స్వయంభు శ్రీ తిరుమల స్వామినాథ బ్రహ్మోత్సవాలు కొన్ని రోజుల క్రితం ముగిసినప్పటికీ ఇదే కంకర రోడ్లు నర కయాతన అనుభవించవలసి వచ్చిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎమ్మెల్యే ప్రారంభించింది.. ఈ ఎమ్మెల్యే హయాంలోనైనా రోడ్డు అవునో లేదో అని సంశయంలో పడ్డారు.