22 April, 2026 | 7:35 PM

నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

09-12-2024 12:29 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 8 (విజయక్రాంతి): ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, ఎన్టీఆర్ మార్గ్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నందున నగరంలో సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ తెలిపారు. మధ్యాహ్నం 2గంటల నుంచి 10గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

పది జంక్షన్లలో వాహనాల రద్దీ ఉండే అవకాశం ఉందన్నారు. కావున ట్రాఫిక్ రద్దీగా ఉండే బుద్ధభవన్, నల్లకుంట క్రాస్‌రోడ్, పీవీ స్టాచ్యూ జంక్షన్, ఇక్బాల్ మినార్, తెలుగుతల్లి ఫ్లుఓవర్, ప్రింటింగ్‌ప్రెస్ జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్, రవీంద్రభారతి, కట్టమైసమ్మ, పాత అంబేడ్కర్ విగ్రహం, లిబర్టీ జంక్షన్లలో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల గుండా వెళ్లాలని వాహనదారులకు సూచించారు.