రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి
09-12-2024 12:28 AM
కామారెడ్డి, డిసెంబర్ 8 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం సిద్దరామేశ్వర నగర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లికొడుకు మృతిచెందారు. బాన్సువాడలోని టీచర్స్ కాలనీకి చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు హైదారాబాద్‌కు కారులో బయల్దేరారు. చర్చి గేటు వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి లక్ష్మి(50), కుమారుడు అక్షయ్(24) మృతిచెందారు. రాజేశ్వర్‌రెడ్డి, భూమవ్వలకు తీవ్ర గాయాలయ్యాయి.






