17 March, 2026 | 2:54 AM

ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాల్సిందే

13-01-2026 10:37 PM

అవగాహన కల్పించిన ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి, జోనల్ వర్క్ షాప్ మేనేజర్ జగన్, మేడిపల్లి తహసిల్దార్ కృష్ణ చైతన్య, డాక్టర్ రోహిత్

మేడిపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రజల్లో రోడ్డు భద్రతపై విస్తృతవగాన కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో మంగళవారం మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని  మేడిపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సీఐ గోవిందరెడ్డి "అరైవ్ ఆలైవ్" అనే ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని ఉప్పల్ డిపో జోనల్ వర్క్ షాప్ లో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి మాట్లాడుతూ... వాహనదారులు, పాదాచార్యులు, సాధారణ ప్రజలు, ట్రాఫిక్ నియమ, నిబంధనలను, కచ్చితంగా పాటించాలని, ద్విచక్ర వాహనంపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ సూచనలను తప్పకుండా పాటించాలని, అతివేగంతో, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయరాదని, విలువైన ప్రాణాలు కోల్పోవద్దని సూచించారు. జోనల్ వర్క్ షాప్ మేనేజర్ జగన్ మాట్లాడుతూ... దాదాపు 80% రోడ్డు ప్రమాదాలు ద్విచక్ర వాహనాల వలన జరుగుతున్నాయని తెలిపారు.

మేడిపల్లి తహసిల్దార్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ వినియోగించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని, మొబైల్ ఫోను ఉపయోగిస్తూ వాహనం నడపరాదని, వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ రోహిత్ మాట్లాడుతూ ప్రమాదం చెప్పి రాదని, సురక్షితంగా వాహనాన్ని నడిపి గమ్యస్థానాలకు చేరాలని సూచించారు. గతంలో తాను రోడ్డు ప్రమాదంలో జరిగిన తీవ్రమైన గాయాల ద్వారా, తను చేసిన సర్జరీలను వివరించారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రతి ఒక్కరు తమ కుటుంబానికి సురక్షితంగా చేరుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.