calender_icon.png 14 January, 2026 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదాదేవి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న సెస్ చైర్మన్ చిక్కాల రామారావు

13-01-2026 10:33:52 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం కస్బెకట్కూర్ గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో గోదాదేవి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ వలకొండ వేణుగోపాల్ రావు, ఆలయ చైర్మన్ వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బొమ్మవరం దేవేందర్ రావు, సర్పంచ్ బొడ్డు స్వాతి–అనిల్, ఉపసర్పంచ్ జూపల్లి అజయ్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మంత్రి శ్రీవర్ధన్‌తో కలిసి సెస్ చైర్మన్ చిక్కాల రామారావు పాల్గొని భగవంతుని ఆశీర్వాదాలు అందుకున్నారు.