ట్రాఫిక్ నియమాలు పాటించాలి
ట్రాఫిక్ ఏసీపీ జీ శంకర్ రాజ్
సికింద్రాబాద్, మే 14 (విజయక్రాంతి): ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షిత ప్ర యాణం సాగించాలని ప్రతి ఒక్కరూ హెల్మె ట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని ట్రా ఫిక్ ఏసీపీ జీ శంకర్ రాజ్, ఇన్స్‌పెక్టర్ వి.సర్దార్ నాయక్ ఐవి రమణయ్య పిలుపునిచ్చారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బీ సుమతి ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీసీపీ కే రాహుల్ రెడ్డి పర్యవేక్షణలో తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీసీపీ షాకీర్ హుస్సేన్, తిరుమలగిరి డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ జీ శంకర్ రాజ్ ఆధ్వర్యంలో బోయిన్‌పల్లి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కార్యాల యంలో వాహనదారులు, డ్రైవర్లకు ట్రాఫిక్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏసీపీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాంగ్ సైడ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, నంబర్ ప్లేట్ ఉల్లంఘన, డ్రై వింగ్ లైసెన్సు లేకుండా, సీట్‌బెల్ట్, హెల్మెట్ ధరించకుండా, తాగి వాహనం నడపడం, ట్రాఫిక్ ఉల్లంఘనలపై తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు భద్రతపై ప్ర త్యేక వీడియోల ద్వారా అవగాహన కల్పించారు.
అనంతరం తిరుమలగిరి డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్‌రాజ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నిత్యం పెరిగిపోతున్నాయని అవగాహనతోనే నివారణ చేయవ చ్చునని రోడ్డు ప్రమాద రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేద్దామన్నారు. క్రమశిక్షణ ఉన్నతమైన భవిష్యత్తుకు మార్గం చూపిస్తుందన్నారు.
తిరుమలగిరి ఇన్స్‌ఫెక్టర్ సర్దార్ నా యక్ మాట్లాడుతూ ట్రాఫిక్ జంక్షన్ వద్ద అప్రమత్తతో ప్రయా ణం చేయాలని తొందరపడి వెళితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా డ్రైవర్ కే రామ్ చందర్‌ను ఏసీపీ అభినందించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఇన్స్‌పెక్టర్‌లు వీ సర్దార్ నాయక్, ఐ.వి రమణయ్య, సబ్ ఇన్స్‌పెక్టర్లు యుగంధర్ రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ట్రాఫిక్ సిబ్బం ది తదితరులు పాల్గొన్నారు.






