16 May, 2026 | 2:09 AM

చోరీ కేసులో నిందితుల అరెస్ట్

16-05-2026 12:00 AM
  1.   24తులాల బంగారం, 44 తులాల వెండి స్వాధీనం
  2. ఈ నెల 4న ములుగు మండలం చిన్న తిమ్మాపూర్‌లో ఘటన

సిద్దిపేట క్రైం, మే 15(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా ములుగు మండలం చిన్నతిమ్మాపూర్ గ్రామంలో ఈ నెల 4న శాలివా హిని నర్సింలు ఇంట్లో జరిగిన చోరీ కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీ నం చేసుకున్నారు. నర్సింలు పనిమీద ఇం టికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లిన కొద్దిసేపటి తర్వాత అతని కుమారుడు వేణు వచ్చి చూడగా ఇంటి, బీరువా తాళాలు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు గుర్తిం చాడు.

వెంటనే అతను ఫోన్ ద్వారా ఈ విషయాన్ని తన తండ్రి నర్సింలుకు తెలియజే శాడు. దీంతో ఇంటికి చేరుకున్న నర్సింలు పరిశీలించగా, తన కుమార్తె, తన భార్యకు చెందిన బంగారం, వెండి  ఆభరణాలు, రూ.2 లక్షల నగదు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుమారు 24 తులాల బంగారం, 44 తులాల వెండి, నగ దు దొంగతనానికి గురైనట్లు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ కేసును గజ్వేల్ రూరల్ సీఐ డి.రవిరాజు ఆధ్వర్యంలో ములుగు ఎస్‌ఐ రఘుపతి, పోలీస్ స్టేషన్, సీసీఎస్ సిబ్బందిని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మం డలం పెద్దమ్మ కాలనీకి చెందిన మడిగెల బాలచందర్, మజీద్పూర్ గ్రామంలో ఉంటు న్న పొత్రకొండ బాలకృష్ణ(శ్రీకాకుళం జిల్లా నుల్కజోడు గ్రామస్తుడు), దమ్మాయిగూడ జవహర్ నగర్ కు చెందిన ఇప్పలపల్లి నరేష్ అలియాస్ నచ్చులను పోలీసులు నిందితులుగా గుర్తించారు.

ఈ నెల 9న నిందితుల్లో ఒకరైన పోత్రకొండ బాలకృష్ణ వంటిమామిడి చెక్‌పోస్ట్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండగా, పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, నేరం అంగీకరించాడు. మడిగెల బాలచందర్‌ను కీసర పోలీ సుల సహాయంతో అదుపులోకి తీసుకున్నా రు. నరేష్ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి చోరీ సొత్తును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. తక్కువ సమయంలోనే కేసు ను ఛేదించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని సీపీ రష్మీ పెరుమాళ్ అభినందించారు.