ట్రాఫిక్ రూల్స్ పాటించాలి
11-06-2026 12:42 AM
గోవిందరావుపేట, జూన్ 10 (విజయక్రాంతి): వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాలను నిర్మూలించవచ్చని పస్రా సీఐ దయాకర్, ఎస్ఐ తాజుద్దీన్ పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పస్రా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సుమలత అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు.
అలాగే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఇందుకు సంబంధించిన ట్రాఫిక్ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు డ్రగ్స్ వాడకం వల్ల జరిగే నష్టాలను వివరించారు. అనంతరం గ్రామంలో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటారు.






