9 June, 2026 | 1:23 AM

తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

09-06-2026 12:00 AM

బాచుపల్లి ఫ్లైఓవర్‌తో ఎంతో మేలు

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా సోమవారం బాచుపల్లి ఫ్లైఓవర్‌ను ప్రారంభించా రు. మియాపూర్ క్రాస్‌రోడ్స్ నుంచి గండిమైసమ్మ వరకు సాఫీగా ట్రాఫిక్ ప్రవాహం సాగేందుకు బాచుపల్లి క్రాస్‌రోడ్స్ వద్ద హెచ్‌ఎండీఏ బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టు ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడం, రహదారి భద్రతను మెరుగుపరచడం కోసం రూపొందించబడింది.

ఈ ఫ్లైఓవర్ 1.30 కి.మీ.ల పొడవుతో, 4 లేన్ల రహదారి, 19 పియర్లు/అబట్మెంట్లతో నిర్మించబడింది. అదనంగా 1.30 కి.మీ. పొ డవైన రెండు లేన్ల స్లిప్ రోడ్లు ఏర్పాటు చేయబడ్డాయి. రూ.65.53 కోట్ల వ్య యంతో పూర్తి చేశారు. హెచ్‌జీసీఎల్, ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా సర్వీస్ రోడ్ల కోసం ప్రధాన వంతెనల నిర్మాణంతో పాటు, ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ నెం.18 ఏ ఇంటర్చేం జ్ నుంచి నర్సింగి రింగ్ రోడ్ వరకు కొత్త సర్వీస్ రోడ్ నిర్మాణాన్ని రూ.229.00 కోట్ల అంచనాతో ప్రతిపాదించారు.

ప్రస్తుతం ఉన్న లో-లెవల్ కాజ్వేలు వరదల సమయంలో మునిగిపోవడం, నం ది సర్కిల్ సమీపంలో ట్రాఫిక్ రద్దీ, ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ నెం.18 వద్ద తలెత్తుతున్న రవాణా సమస్యలను పరిష్కరించేందుకు ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అన్ని కాలాల్లో నిరంతర రవాణా సౌకర్యం, ట్రాఫిక్ ప్రవాహం మెరుగుదల, రహదారి భద్రత పెంపు, నర్సింగి, కోకాపేట్, ఫైనాన్షియల్ డి స్ట్రిక్ట్ ప్రాంతాలకు మెరుగైన అనుసంధానం కలుగుతుంది.

త్వరలోనే టెండర్లు ఆహ్వానించబడనున్నాయి. అలాగే గచ్చిబౌలి సమీపం లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, అడ్డంకులను తగ్గించేందుకు హెచ్జీసీఎల్, నానక్‌రాంగూడ నుంచి గచ్చిబౌలి వరకు 1.75 కి.మీ. పొడవున ఓఆర్‌ఆర్ ఎడమ ప్రధాన రహదారి వి స్తరణ పనులను రూ.26.50 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతోంది. ఈ ప్రాజెక్టులో అదనపు లేన్ ఏర్పాటు, వాహన అండర్‌పాస్‌లు, కల్వర్టుల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి వంటి పనులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు పనులను ఎంఎస్ సుధాకర ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించారు.