మురళీధర్‌రెడ్డికి వడదెబ్బ
ఆస్పత్రిలో చికిత్స.. కోలుకుంటున్న కాంగ్రెస్ నేత
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కే మురళీధర్‌రెడ్డి రెండు రోజుల క్రితం వడదెబ్బకు గురై అస్వస్థతకు లోనయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో పాటు స్పృహ కోల్పోయి పడిపోవడంతో ఆయనను బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఎంఆర్‌సి నాయుడు, ధనలక్ష్మి పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. మురళీధర్‌రెడ్డికి అవసరమైన అన్ని వైద్య పరీక్షలు, స్కానింగ్‌లు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని, ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొన్నారు. మరో రెండు మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే పూర్తిగా కోలుకుంటారని వైద్యులు వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మురళీధర్‌రెడ్డిని పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్య కర్తలు, బంధువులు పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.






