9 June, 2026 | 1:17 AM

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తికి జైలుశిక్ష

09-06-2026 12:00 AM

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు 

బుగ్గారం ఎస్‌ఐ సతీష్ 

ధర్మపురి, జూన్ 8 (విజయక్రాంతి): మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని బుగ్గారం ఎస్త్స్ర జి. సతీష్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ధర్మపురి సిఐ ఎ. రాంనర్సింహరెడ్డి ఆద్వర్యంలో ఎస్త్స్ర జి. సతీష్ , బుగ్గారం పోలీస్ స్టేషన్ పరిధిలో తన సిబ్బందితో  బుగ్గారం పోలీస్ స్టేషన్ పరిధిలో  చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా ధర్మపురి మండలం రామయ్యపల్లి గ్రామానికి చెందిన గడ్డం రవి డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడడంతో బుగ్గారం పరీక్ష చేసి, ధర్మపురి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జానకి  ముందు హాజరు పరచినట్లు తెలిపారు.

గడ్డం రవి కి మూడు రోజుల జైలు శిక్ష  విధించినట్లు ఎస్త్స్ర తెలిపారు. మెజిస్ట్రేట్  ఆదేశాల మేరకు అతన్ని  జగిత్యాల సబ్ జైలు కు తరలించిన్నట్లు తెలిపారు. రోడ్డుపైన ప్రయాణించే ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపా లని సూచిస్తూ, మద్యం సేవించి వాహనం నడుపరాదని, సీట్ బెల్ట్ తప్పకుండ ధరించాలని, అతివేగం నివారించడం  మరియు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని, ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటాము అని తెలిపారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత పట్ల అవగాహన ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.