28 July, 2026 | 2:50 AM

ఉప్పల్ స్టేడియం వద్ద విషాదం

28-07-2026 01:28 AM

అతివేగం ప్రాణం తీసింది.. 

యువకుడు మృతి, 

మరో విద్యార్థి పరిస్థితి విషమం

ఉప్పల్, జూలై 27 (విజయక్రాంతి): ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. అతివేగంగా వెళ్తున్న మోట్సాకిల్ రోడ్డు దాటుతున్న పాదచారిని ఢీకొనడంతో బైక్ నడుపుతున్న యువకుడు మృతి చెందగా, పాదచారి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బోడుప్పల్కు చెందిన ఉదిత్ నారాయణ (27) చెంగిచెర్లకు చెందిన అరికేరి ఓంకార్కు చెందిన టీజీ10ఈ3300 నంబరు గల ఎస్డీ జావా మోట్సాకిల్ను తీసుకుని వెళ్లాడు.

శనివారం రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో ఉప్పల్ స్టేడియం గేట్ నెం.1 సమీపంలోని ఎక్ మినార్ మసీదు వద్ద నుంచి స్టేడియం వైపు వెళ్తుండగా, అతివేగంగా బైక్ నడుపుతూ రోడ్డు దాటుతున్న వరంగల్కు చెందిన వైష్ణవ్ విశ్వంతమ్ (20)ను ఢీకొట్టాడు. ప్రమాదం అనంతరం బ్పై నియంత్రణ కోల్పోయిన ఉదిత్ నారాయణ రోడ్డుపై పడిపోయి తీవ్ర తల గాయాలు పొందాడు. వైష్ణవ్ విశ్వంతమ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరినీ 108 అంబులెన్స్లో గాంధీ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ఉదిత్ నారాయణను మృతిగా నిర్ధారించారు. వైష్ణవ్ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.