ముగ్గురిపై అట్రాసిటీ కేసు నమోదు
30-05-2024 02:07 AM
సిద్దిపేట రూరల్, మే 29: సిద్దిపేట రూరల్ మండలంలోని సీతారాంపల్లి గ్రా మానికి చెందిన ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీను, ఎస్సై అపూర్వారెడ్డి తెలిపారు. సీతారాంపల్లి గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మిట్టపల్లి కిషన్‌తో పాటు మరో ఐదుగురు హనుమాన్ మాల ధరించారు. మంగళవారం పూజ చేసుకునేందుకు గ్రామంలోని హనుమాన్ ఆలయానికి వెళ్లగా.. అదే గ్రామానికి చెందిన దొంగల శ్రీకాంత్ రెడ్డి, గుర్రం భూమిరెడ్డి, చింతల మహేష్ గౌడ్ అనే వ్యక్తులు వారిని గుడిలోకి రాకుండా బయటే ఆపేశారు. కులం పేరుతో వారిని దూషించారు. ఈ విషయమై కిషన్ ఫిర్యాదు మేరకు అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.






