29 July, 2026 | 7:23 PM

లండన్‌లో తెలంగాణవాసుల దుర్మరణం

03-09-2025 01:25 AM
  1. రెండు కార్లు ఢీకొని ఇద్దరి మృతి
  2. ఫీర్జాదిగూడ, నాదర్‌గుల్‌లో విషాదం

మేడిపల్లి/బడంగ్‌పేట్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): లండన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ యువకులు మృతిచెందారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ ఎనిమిదవ డివిజన్ అమృత కాలనీకి చెంది న రాపోలు రవీందర్ రావు, కిరణ్మయి దంపతుల కుమారుడు రిషితేజ్ (21) ఎంబీఏ చదువు కోసం మే నెల 19న లండన్ వెళ్లా డు. అలాగే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో నాదర్‌గుల్‌కు చెందిన తర్రే ఐలయ్య, మంగమ్మల చిన్న కొడుకు చైతన్య (23) ఇటీవల బీటెక్ పూర్తి చేసి ఉన్నత చదువుల నిమిత్తం గత ఎనిమిది నెలల క్రితం లండన్ వెళ్లాడు.

సోమవారం వినాయక నిమజ్జనం కార్యక్రమంలో భాగం గా రిషితేజ్, చైతన్య సహా ఎనిమిది మంది మిత్రులు వెళ్లారు. కార్యక్రమం అనంతరం తిరిగి వస్తుండగా రెండు కార్లు బలంగా ఢీకొన్నాయి. ప్రమాదంలో చైతన్య, రిషితేజ తీ వ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ మృతి చెందారు. దీంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఉన్నత చదువుల కోసం వెళ్లిన కొడుకులు విగత జీవులుగా మారడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.