2 July, 2026 | 12:27 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

గవర్నర్, సీఎంను కలిసిన ట్రైనీ ఐఏఎస్‌లు

05-06-2025 12:25 AM

హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): ఐఏఎస్‌లంటే ప్రజాసేవకు టార్చ్ బేరర్లని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. ట్రైనీ ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్‌లు గవర్నర్, సీఎం రేవంత్‌రెడ్డిను బుధవారం వేర్వేరుగా కలిశారు. రాజ్‌భవన్‌లో తనను కలిసిన ట్రైనీలను గవర్నర్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ, సంకల్పంతో ఈ విజయాన్ని అందుకున్నందకు వారికి శుభాకాంక్షలు తెలిపారు.

సేవాగుణంతో ప్రజలకు సేవ చేయాలని సూచించారు. మీరు కేవలం అధికారులు కాదని, దేశ భవిష్యత్తు అని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2024 బ్యాచ్ ట్రై నీ ఐఏఎస్‌లు కలిశారు.

ఈ సందర్భంగా వా రిని సీఎం అభినందించి బాధ్యతల నిర్వహణపై వారికి దిశానిర్దేశం చేశారు. ట్రైనీ ఐఏఎస్‌లో సౌరభ్ శర్మ, సలోని ఛబ్రా, హర్షచౌదరి, కరోలిన్ చింగ్తియన్మయి, కొయ్యడ ప్రణయ్ కుమార్‌లతోపాటు అధికారులున్నారు.