05-06-2025 12:25:40 AM
-జిల్లా హెల్త్ కన్వీనర్‌గా దినేష్
- గత ఐదేళ్లుగా జిల్లా జర్నలిస్టులకు సేవలు
- ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు
వనపర్తి, జూన్ 4 ( విజయక్రాంతి ) : వనపర్తి జిల్లా ప్రెస్ క్లబ్ కమిటీ బుధవారం కొత్తకో ట లో నిర్వహించిన ప్రెస్ క్లబ్ కమిటీ సమావేశంలో జిల్లా హెల్త్ కన్వీనర్ గా గంధం దినేష్ ను ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకొని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికై న గంధం దినేష్ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత ప్రతి ఒక్కరికి కల్పించేందుకు తన వం తు కృషి చేస్తానని అన్నారు. గత ఐదేళ్లుగా జిల్లా లోని జర్నలిస్టులకు వైద్యపరమైనటువంటి సేవలు అందించాననీ,భవిష్యత్తులో కూడా జిల్లా జర్నలిస్టు లకు వైద్యపరమైనటువంటి సేవలు మరింత అంది స్తానని తెలిపారు.
నాపై నమ్మకం ఉంచి జిల్లా హెల్త్ కన్వీనర్ గా అవకాశం కల్పించిన కమిటీ సభ్యుల కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ కమిటీ సభ్యులు బొలేమోని రమేష్,కొండన్న యాద వ్,బొడ్డుపల్లి లక్ష్మణ్,రాములు,రవి కుమార్, మహ మ్మద్ ఖలీల్,యాదిరెడ్డి,రవి,శ్రీనాథ్, తిరుపతి, మల్లి కార్జున్,గోపాలకృష్ణ,పురుషోత్తం తదితరులు పాల్గొ న్నారు.