21 July, 2026 | 11:09 AM

సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు శిక్షణ

21-07-2026 12:00 AM

చిన్నంబావి, జూలై 20: మండల స్థాయి ప్రభుత్వ పాఠశాలల సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు మూడు రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని  సోమవారం మండల విద్యాశాఖ అధికారి రాజేందర్ రావు జెడ్పీహెచ్‌ఎస్ పెద్దదగడలో ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమం ఉదయం 9:00 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని,తెలుగు, ఆంగ్లము, గణితశాస్త్రం, పరిసరాల విజ్ఞానం విషయాల్లో  రీసోర్స్ పర్సన్స్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఎంఈఓ  పేర్కొన్నారు.