21 July, 2026 | 11:23 AM

వేంకటేశ్వరస్వామి దేవాలయానికి రోడ్డు మార్గం

21-07-2026 12:00 AM

గండీడ్ జూలై 20 : మండల పరిధిలోని పల్లి గ్రామం నుంచి ఆ గ్రామ శివారులోని వెంకటేశ్వర దేవాలయం మట్టి రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. నాయనోని గుట్టపై 100 ఏళ్ల క్రితం నుంచి ఈ దేవాలయం ఉందని అప్పటినుంచి నేటి వరకు కూడా రోడ్డు మార్గం లేక భక్తులు ఇబ్బందులు గురి అయ్యే వారిని రోడ్డు నిర్మాణంతో భక్తులకు ఎంతో మేలు జరుగుతుందని ఆ గ్రామవాసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి  శ్రీనివాస్ రెడ్డి, జంగళ్ల వెంకటయ్య, డిప్యూటీ సర్పంచ్ భీమయ్య,  వార్డ్ మెంబెర్స్ బోయిని సుమిత్ర,  శ్రీనివాస్,  ఏముక వెంకట్రాములు,  హన్మంతు, చంద్రమ్మకుర్మయ్య, చంద్రయ్య, ఈడిగి అశోక్ గౌడ్, బోయిని వెంకట్రాములు, మేటి ఏర్పుల  మైసయ్య తదితరులు పాల్గొన్నారు.